కాశీ

కైలాస శైలాన కనకాచలమటుల
కనరండి కనరండి  కన్నులారా!
రమ్యమౌ శైలాన రజితాద్రి వాసుని చూచినవారివే చూపులోయి
పార్వతీ నాథుని పరమేశు తిలకించు
హృదయారవిందమే 
 హృదయ మయ్య
నిగమైక వేద్యుని నిరతంబు నాత్మలో 
దర్శించు జన్మమే ధన్య మోయి
ఆ.వె.భక్త సులభు డతడు భవబంధ మోక్షమ్ము
కలుగు జేయనతడు కరుణ తోడ
అతని యాన లేకయాకైన కదలదు
ఇహము పరములిచ్చు యిష్ట పడిన
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత