రావణ మనోవ్యథ
కపులెల్ల యొనగూడి కౌశల్య మొప్పగా
(సేతువు నిర్మించ్రి సీతకొరకు)
కార్యంబు నెరవెరే కాలమహిమ
శిలలెల.ల తేలెగాజలధిలో బెండ్లుగా
కానగ లేరయ్య కాలమహిమ
మానవుల్ మొత్తిరి దానవ సంఘంబు
కాలంపు మహిమను కాంచ గలము
దశకంఠు చరితంబు తార్కాణ మగునయ్య
పథము దప్పిన వాడు పతన మగును
ఆ.వే.
ప్రకృతి కూడ దుష్టు పరి మార్చ లచును
మంచి వారికెపుడు మాన్య తుండు
ధర్మరక్షసేయచేయ ధర్మంబు రక్షించు
సకల నీతి శాస్త్ర సారమిదియె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి