సీస పద్యము--వీర సైనికుడు

(వీర సైనికుని చివరి సందేశం)
సాగనంపుడునన్ను సదనమ్ము వరకును
రణరంగ భూమిలో రాలగానె
పతకమ్ము లన్నియు పదలిమౌరీతిగా
కాయమ్ము పైనింక కప్ప వలయు
అమ్మతో చెప్పండి యధ్భుతంభౌరీతి
సమరాన సమరంబు సల్పినట్లు
తల్లడిల్లవలదనుచు తండ్రికి తెల్పండి
చింతింప వలదంచు చివరి పలుకు
అలసి సొలసి నాను నాదమరిచి నిద్ర
చెందితంచు తెలుపు చెల్లికింక
జనని గర్భమందు జన్మించి నేనంత
ఋణము తీర్చు కొందు రుజువుగాను
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి
(ఒకసైనికుని లేఖ వీరసైనికులెల్ల విన్యాసముల్ జేయు
మంచుకొండపై మసలినారు
దేశరక్షణయొక దీక్షగా చేయుగా
నడుమకట్టిరిపుడు నవ్యరీతి
భరతమాతసుతులు భాసుర తేజులు
వీరికెవరు సాటి విశ్వమందు
ఆందజేయవలయునభినందములెల్ల
మనకురక్షనొసగు మాన్యులోయి
మంచులోనైనను మలమలా మాడ్చెడు
ఎండలో నైనను యేమర రెపుడు
ఆ.వె.నింగి నేలయనక నీటిలో మీరెల్ల
కవచమట్లు మీరు కాపుకాయ
ఆదమరచిమేము హాయిగా నిద్రించు
భాగ్యమందినాము పరవశాన
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి) ప్రేరణతో రాశాను)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత