డిసెంబర్ 31రాత్రి
నిశిరాత్రివేళలో నిబిడాంధకారాన
నడరేయి దాటగా నర్తనంబు
తప్పతాగిజనులు తైతక్కలాడగా
ఆనందమన్నట్లు యభినయంబు
అరుపులూ కేకలు నల్లరే యల్లరి
ఇదియేమి పర్వమ్ము యిలను కలిగె
పొరుగుదేశపువారి పొడబాట్లు మనకేల
ఇంగ్లీజు వారిదౌ యెంగిలేల
ఆ.వే. జనవరొకటంచు జపమేల సేతువు
తెలుగువారికొక తెన్నులేదె
షడ్రుచులునుతెలుపు సంవత్సరాదియె
మనకు పండు గగను మరవ బోకు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి