చరవాణీ-3

చెవి యొధ్ధ చరవాణి చెలితోడి ముచ్చట్లు
కరిగిపోవునుకాదె కాలమంత 
చరవాణి లేకున్న చలియించు కాలమ్ము
ఆగిపోయినయట్లు యనుభవమ్ము
అచ్చట్లు ముచ్చట్లు నాజ్ఞలు యలుకలు 
అన్నియు దానిలో నణగి యుండు(నమరియుండు)
యంత్రంబు యంత్రించె యంత్రిని ధరణిలో
దాసుడే దొరయట్లు దాపురించె
ఆ వే.కష్టసుఖములెల్ల కలసియుండునుకాదె
మంచి వెన్క నున్న యట్లు
ఆత్మశక్తిలేని యభివృధ్ధియంతయు
వాపుయగును కాని బలుపుకాదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత