చరవాణి--2

చరవాణి చేబూని శకటమ్ము నడుపగా
సమవర్తి నీకింక సన్ని హితుడె
ఆలుబిడ్డలతోడ ననుబంధ మణగారు
తల్లిదండ్రులపాట్లు.తలపలేము
రహదారి యంతయు రణరంగమట్లుగా
రక్తమోడును కాదె రాక్షసాన 
నిన్నునమ్మినవారి నిలువునా ముంచగా
జతనమ్ము చేయగా జాలిలేదె
చరవాణితోడ సరసంబు మానుము
పెద్ద లనిన మాట సద్ది మూట
ఆ.వె.ఆత్మరక్షకొరకు నారట పడుటెల్ల
మనుజ ధర్మ మనుచు మరవకయ్య
ప్రాణ రక్ష మనకు ప్రాథమ్య మనుమాట
మరువరాదు నీవు మాటలే

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత