ఛరవాణి1
చరవాణి చేతిలో చావేమొ ముంగిట
మానవత్వంబంత మంటలోన
చరవాణి మ్రోగిన చంచలమ్మౌ నంత
మాటపలుకంత మారిపోవు
మిన్నువిరిగెనన్న మిన్నకుందురుగాదె
ఏదిపోయిననేమి నేమికొరత
చరవాణితోడున్నచక్రంబు తిప్పుదు
కొరతేమి నాకంచు కోత కోయి
దగ్గరున్న వారు దయ్యాల వలెదోచు
మోము పొత్త మనుచు మైత్రి చేయు
బ్రతుకు గతిని మార్చె మాయంపుచరవాణి
ఏమి గతియొ మనకు యెరుక లేదు
రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి
సెల్ఫి లన్న తనకు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి